Jogi Ramesh (Credits: X)

Vijayawada, Aug 13: మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు (ACB Raids) చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. రమేష్ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వీడియోలను బట్టి తెలుస్తుంది.

జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

అగ్రి గోల్డ్ భూముల విషయంలో..

అగ్రి గోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌ పై ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా భూముల రిజిష్ట్రేషన్ చేయించుకున్నట్టు చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు  ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే  ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు