Vij, Aug 12: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ ను సందర్శించినప్పుడు తాను ఎమోషన్ అయ్యానని...చేయని తప్పునకు చంద్రబాబును అన్యాయంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే స్నేహా బ్లాక్ లో ఉంచారని మండిపడ్డారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, తప్పు చేయని వారు ఎవరైనా జైలుకి వెళ్లకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
మర్డర్ కు ప్రేరేపించిన వాడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలని...అదే పరిస్థితి కనుక వస్తే ఫస్ట్ జగన్ ను జైల్లో వేయాలన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందేనని ప్రస్తావించారు అనిత.
వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో తెలుసని, గురివింద గింజ తన నలుపు ఎరుగదని అన్నట్లు, వాళ్ల కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడటం మానేసి శాంతి భద్రతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.