Divya Vani Resigns: తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా, ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని కన్నీరు పెట్టుకున్న సినీనటి దివ్యవాణి

తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా (Divya Vani Resigns) చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు. ఈరోజు ఉదయం జరిగే ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని దివ్యవాణి పేర్కొన్నారు.

Divya Vani Resigns to Telugu Desam Party (Photo-Video Grab)

Amaravati, June2: తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా (Divya Vani Resigns) చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు. ఈరోజు ఉదయం జరిగే ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని దివ్యవాణి పేర్కొన్నారు. అయితే ఉదయానికి రాజీనామా (Telugu Desam Party) చేస్తున్నట్టు దివ్యవాణి వీడియో పంపారు. తన రాజీనామాపై హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు.నిన్న చంద్రబాబును కలిసి దివ్యవాణి ఆనందం.. తెల్లారేసరికి రాజీనామా..కాగా... మొన్న(మంగళవారం) కూడా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టి దివ్యవాణి (Divya Vani) కాసేపు హడావుడి చేశారు. అనంతరం దానిని తొలగించారు.

తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు. తనను సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు.నిన్న చంద్రబాబును కలిసి దివ్యవాణి తెల్లారేసరికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు తెరలేపుతోంది.

దివ్యవాణి విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కొందరు మహిళా నేతలు నాకు ఫోన్‌ చేసి తిట్టారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను.

టీడీపీకి దివ్యవాణి రాజీనామా, వెంటనే వెనక్కి తగ్గిన సీనియర్ నేత, మహానాడులో ఘోర అవమానం జరిగిందని ఆవేదన

నా సమస్యను లోకేశ్‌ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారు.కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్‌ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్

Share Now