Praja Chaitanya Yatra: బాబుకు కోడిగుడ్లతో స్వాగతం పలికిన వైజాగ్, ప్రజా చైతన్య యాత్రకు అడుగడుగునా నిరసన సెగలు, ఇరుపార్టీల మధ్య వేడెక్కిన వార్, వైజాగ్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Vizag Tour) ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటి'స్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandra babu) పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రజా చైతన్య యాత్ర (TDP Praja Chaitanya Yatra) చేపడుతున్న బాబుకు వైజాగ్‌లో (Vizag) రాజధాని సెగ తగిలింది.
Visakhapatnam, Febuary 27: ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Vizag Tour) ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటి'స్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandra babu) పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రజా చైతన్య యాత్ర (TDP Praja Chaitanya Yatra) చేపడుతున్న బాబుకు వైజాగ్‌లో (Vizag) రాజధాని సెగ తగిలింది.
రాజధానిపై బాబు వైఖరి సరిగా లేదంటూ కొంతమంది చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. లాభం లేదనుకుని బాబు కాన్వాయ్‌ని వదిలి..పాదయాత్రగా ముందుకు కదిలారు.
ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు సైతం విశాఖ ఎయిర్‌పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ రహదారి కూడలి వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.
Here's Telugu Desam Party Tweet
తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కాగా రోడ్లపై వైసీపీ కార్యకర్తల బైఠాయింపు వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురవుతోంది. విశాఖ విమానాశ్రయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కారును కొందరు ధ్వంసం చేయడం కలకలం రేపింది. చంద్రబాబు కాన్వాయిని చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు దాన్ని ముందుకు కదలనివ్వలేదు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి వద్ద టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
విద్యుత్‌రంగంపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం
ఇదిలా ఉంటే అందరి భరతం పడతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. అధికారం కోల్పోయిన నిస్సహాయతలో ఇలా మాట్లాడుతున్నారంటూ.. మరింత దిగజారిపోవచ్చన్న రీతిలో ఎద్దేవా చేశారు. ‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది.
Here's Vijayasai Reddy Tweet
ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ జోరుగా వైరల్ అవుతోంది.
కాగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్యయాత్ర కాదు పచ్చి భూతుల యాత్ర అంటూ ఎద్దెవా చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ‌్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారని విమర్శించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమిని కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల పేరుతో చంద్రబాబు రియల్ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు.
కాగా టీడీపీ రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటం మాత్రం ఆపటం లేదు . రాజధానిగా అమరావతి కొనసాగించాలని ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలా.. లేదంటే మూడు రాజధానులు కావాలా..? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజధాని తరలింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)