TDP vs YSRCP: సీఎం జగన్‌పై రాయలేని భాష వాడిన టీడీపీ నేత పట్టాభి, నిరసనగా పట్టాభి ఇల్లు-టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు, గవర్నర్ కు ఫోన్ చేసి దాడులు గురించి తెలిపిన చంద్రబాబు
ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది ఏకంగా దాడుల వరకు వెళ్లింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మీడియా సమావేశంలో ఏపీ సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలు (TDP spokesperson Pattabhi Ram) చేసారు. గంజాయి స్మగ్లర్లు పొరుగు రాష్ట్ర పోలీసుల పై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
Amaravati, Oct 19: ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది ఏకంగా దాడుల వరకు వెళ్లింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మీడియా సమావేశంలో ఏపీ సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలు (TDP spokesperson Pattabhi Ram) చేసారు.
గంజాయి స్మగ్లర్లు పొరుగు రాష్ట్ర పోలీసుల పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే..తెలంగాణ - తమిళనాడు పోలీసులకు (TN Police) నోటీసులు ఇవ్వండంటూ పట్టాభి వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మ అంటూ...అరే బోసిడీకే తెలంగాణ పోలీసులకు (TS Police) ఇవ్వరా నోటీసు అంటూ ..గుంటూరు ఎస్పీకి ఇవ్వరా నోటీసులు..నక్కా ఆనందబాబు కు ఇస్తావురా నోటీసులు.. బోసిడీకే అంటూ రాయలేని భాషలో చెలరేగారు.
ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నేతల కొమ్ము కాస్తున్న గంజాయి స్మగ్లర్లు పోలీసుల పై బాంబు దాడులు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో..వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పట్టాభి ఇంటి పైనా..అదే విధంగా మంగళగిరి సమీపంలోని టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనంతో పాటుగా లోపల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీని పైన వెంటనే చంద్రబాబు స్పందించారు. గవర్నర్ కు ఫోన్ చేసారు.
పార్టీ కార్యాలయం ..పట్టాభి ఇంటి పైన జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేసారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. దాడి వివరాలను చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబు వెంట దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ముఖ్యనేతలు కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు
సీఎం జగన్ పై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఆర్టీసి బస్టాండ్ కూడలి లోని గాంధీ విగ్రహం ముందు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. నిరసన కార్యక్రమం లో పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు..
విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు
విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక‌్షన్‌లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేణిగుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత సుధీర్‌రెడ్డిపై చెప్పులు, రాళ్లుతో వైసీపీ శ్రేణులు దాడి చేశారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ దగ్గర దాడి కూడా దాడి జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సుధీర్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియాపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగలేఖ రాశారు. జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా లిస్టులో ఏపీ చేరిందన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్
ఏపీలో టీడీపీ నేతల దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేశారని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది. ఈ కథనం ప్రకారం..టీడీపీ నేతలు, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. అయితే దాడి విషయం తన దృష్టికి రాలేదని అమిత్ షా తెలిపినట్లుగా కథనంలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపింది. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్‌షా హామీ ఇచ్చినట్లుగా ఆ కథనంలో పేర్కొంది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
టీడీపీ నేతలు నోటికి హద్దూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్‌కు ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఓటమిని చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబుతో పోలిస్తే జంతువులు కూడా సిగ్గుపడతాయి. కొడుకు చేతకానివాడని చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చంద్రబాబు అసలు పోటీనే కాదు. టీడీపీ నేతలు ఉగ్రవాదులు మాట్లాడే భాష వాడుతున్నారు. సీఎం జగన్ పాలనలో దళారులు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ నేతలే అంగీకరించడం లేదని’’ సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు.
నక్కా ఆనందబాబు ఇంట్లో హై డ్రామా
మాజీ మంత్రి మరియు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఇంట్లో హై డ్రామా సాగింది, విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం పట్టణం నుండి ఒక పోలీసు బృందం రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనకు నోటీసు ఇచ్చింది. రాష్ట్రంలో గంజాయి సాగు మరియు అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతోందని, యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని మాజీ మంత్రి అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రాన్ని సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అయితే ఆధారాలు చూపాలంటూ పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చారు.
పోలీసుల రాక గురించి తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి ఇంటికి చేరుకుని పోలీసులు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఔషధాల అక్రమ వ్యాపారాన్ని తనిఖీ చేయడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించడం తప్పు కాదా అని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తూ నోటీసు తీసుకోవడానికి ఆనందబాబు నిరాకరించారు. అయితే, అక్టోబర్ 19 ఉదయం తిరిగి వస్తామని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు.
గతంలో, టిడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు కూడా డ్రగ్స్ సమస్యపై మాట్లాడినందుకు కాకినాడ పోలీసులు నోటీసు ఇచ్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి కీలక సమస్యపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు "దళిత నాయకుడి వేధింపులు" అని పిలిచే ఈ సంఘటనపై టిడిపి నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఇక పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కె. పట్టాభి రామ్ విలేఖరుల సమావేశంలో, వైసిపి ప్రభుత్వం అధినేతపై నిప్పులు చెరిగారు. ఆయనకు నోటీసు ఇవ్వడానికి నర్సీపట్నం నుండి గుంటూరు వరకు ప్రయాణించిడం "అతి అత్యుత్సాహం" అంటూ పట్టాభి పోలీసులను విమర్శించారు."ఇంత వేగంగా పోలీసు బృందాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, దాడుల కేసులు పెరుగుతున్నాయి" అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
వారిని పట్టుకోవడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించే పోలీసు బృందాలపై గంజాయి స్మగ్లర్లు చేసిన దాడులపై మీడియా నివేదికలను ఉటంకిస్తూ, టిడిపి అధికార ప్రతినిధి వారందరికీ నోటీసులు జారీ చేయడానికి వైసిపి ప్రభుత్వానికి ధైర్యం సరిపోతుందా అంటూ ఎద్దేవా చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)