Telangana New CM Oath: ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం ఆసన్నమైంది, ప్రజలంతా రేపటి ప్రమాణస్వీకారానికి తరలి రండి, తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Revanth Reddy (photo-X)

Hyd, Dec 6: తెలంగాణకు కాబోయే నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటన( Delhi )బిజీబిజీగా కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.

అనంతరం కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో ఆయన సమావేశమయ్యారు. హస్థినలో అన్ని లాంఛనాలను ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. ఇంతలోనే రేవంత్‌రెడ్డికి హైకమాండ్‌ ఫోన్‌ చేసి వెంటనే ఏఐసీసీ( AICC office) కార్యాలయానికి రావాలని చెప్పడంతో హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యాడు.

మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హై కమాండ్ బంఫరాఫర్, డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్ష పదవి..

ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

సీఎంగా రేవంత్‌ రేపు ప్రమాణ స్వీకారం, సీఎం జగన్‌ తో పాటు కేసీఆర్‌కు ఆహ్వనం, ఇంకా ఎవరెవరికి ఆహ్వనం పంపారంటే..

‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం’’ అని రేవంత్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారానికి.. 300 మంది అమరవీరుల కుటుంబాలకు టీ పీసీసీ ఆహ్వానం పంపింది. మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆహ్వానం పంపింది.కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. కాంగ్రెస్‌ విజయం అమరవీరులకు అంకితమని రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.



సంబంధిత వార్తలు