Revanth Reddy as New Telangana CM (Photo-X)

Hyd, Dec 6: ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలతో పాటు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లకు ఆహ్వానాలు పంపారు.రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు.

కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమితం, ఈ కాంగ్రెస్ పాలన కూడా ఆర్నెళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, చిదంబరం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే తదితర సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, ప్రొ.నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్య తదితరులను కూడా ఆహ్వానించారు. పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే సోనియా, రాహుల్‌, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేబినెట్ కూర్పుపై డీకే శివ‌కుమార్ తో సుధీర్ఘ స‌మావేశం, ఇవాళ ఖ‌ర్గే, సోనియా, రాహుల్ ను కలువ‌నున్న రేవంత్

వీరికి ఆహ్వానం పంపనున్నారు..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు.

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్.

తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం

మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు.

గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు.

తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు.

తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు

కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు

మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు.