BJP MLA Raja Singh on Congress: కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమితం, ఈ కాంగ్రెస్ పాలన కూడా ఆర్నెళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
MLA Raja Singh (Photo-Video Grab)

Hyd, Dec 5: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, కొప్పు భాషా తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజాసింగ్..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై (BJP MLA Raja Singh on Congress) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఆర్నెళ్లు లేదా (Congress Government Ruling Six Months) ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం (BJP will Come to Power) వస్తుంది. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కేసీఆర్ పై తీవ్ర రాజాసింగ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం అంతం అయిందని అన్నారు. కేసీఆర్ రావణుడు.. తెలంగాణ ప్రజలను మోసం చేశాడని, ఎస్సీలను కేసీఆర్ మోసం చేశాడని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేబినెట్ కూర్పుపై డీకే శివ‌కుమార్ తో సుధీర్ఘ స‌మావేశం, ఇవాళ ఖ‌ర్గే, సోనియా, రాహుల్ ను కలువ‌నున్న రేవంత్

దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిండు, దళితులందరికీ మూడెకరాల భూమి, దళిత బంధు ఇవ్వలేదు. అంబేద్కర్ కు ఎప్పుడూ నివాళులు అర్పించలేదని రాజాసింగ్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు బీజేపీతోనే జరిగిందని, బీజేపీ ఒత్తిడితోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. ఎస్సీ సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చున్నాడు. కేసీఆర్ ను, ఆయన కుటుంబంను ప్రజలు బహిష్కరించారని రాజాసింగ్ అన్నారు.

New Telangana CM Revanth Reddy: స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం దాకా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే, ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి 

మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్‌ ‍ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వీఐపీలు విచ్చేయనున్నారు.