No Special Status to AP: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, స్పష్టం చేసిన కేంద్రం, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తెలిపిన కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్

ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం (special status) లేదన్నారు.

Minister of State for Home Affairs Nityanand Rai. (Photo Credits: ANI)

Amaravati, Mar 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని (No Special Status to AP) మోదీ సర్కారు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం (special status) లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని..పరిష్కారం తమ చేతుల్లో లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని నిత్యానంద్‌రాయ్ (Union Minister Nityanand Rai) సూచించారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు అమల్లో ఉన్నాయని, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. పునర్విభజన చట్టం అమలులో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఏపీలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వార్తలు, అప్రమత్తమైన ఏపీ సర్కారు, వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచన

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని అన్నారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

కేంద్రం ఏపీ పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తోందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో ఎందుకు విలీనం చేయడంలేదని ప్రశ్నించారు. గుజరాత్‌కి ఒకనీతి.. ఏపీకి మరో నీతా అని రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిలదీశారు.



సంబంధిత వార్తలు

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?