Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్‌ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్

మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్‌ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

There is nothing wrong in calling Lokesh a Pappu: YS Jagan Mohan Reddy

Vjy, Oct 23: రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్‌ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

గుంటూరులోని జీజీహెచ్‌ లో సహాన కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, లోకేష్‌ దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారు.

బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్‌ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి.

వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా, జగన్‌పై తీవ్ర విమర్శలు, రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని మండిపాటు

దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. దిశ యాప్‌ను పనిచేయకుండా చేశారు. హోంమంత్రి అనితకు కూడా నిజంగా బుద్ధిలేదు. అందుకే దిశ లేకుండా చేశారు. ఇప్పటికైనా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు.

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో సహానా ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే, పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా బాధితులకు సాయం చేసి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

సహానా కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. దళిత చెల్లి పరిస్థితిని చూస్తే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్ఢర్‌ లేదు. శాంతిభద్రతలు దిగిజారిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేది. దిశ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచామన్నారు.

ఈ ఘటనలో నిందితుడు నవీన్‌.. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. నిందితులు బాధితురాలిపై శారీరకంగా, లైంగిక​ దాడి జరిపి ఆసుపత్రిలో జాయిన్‌ చేసి వెళ్లిపోయారు. యువతిపై మృగాళ్లలా దాడి చేశారు. యువతి దేహాంపై కమిలిన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కళ్లేదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిందితుడు అధికార టీడీపీకి చెందిన వాడు కాబట్టే అతడిని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదు. నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి ఆసుపత్రికి వచ్చారట.

రాష్ట్రంలో ప్రతీచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. పలాసలో టీడీపీకి చెందిన ప్రబుద్దులే అత్యాచారం చేశారు. అఘాయిత్యాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నారు.

పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నాడు. పవన్‌ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. హిందూపురంలోనూ అత్తాకోడలిపై గ్యాంప్‌ రేప్‌ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరామర్శకు వెళ్లలేదు. అనకాపల్లిలో బాలికను ప్రేమోన్మాది చంపేశాడు. వేధింపులపై అంతకుముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారని జగన్ మండిపడ్డారు.

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్‌ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి. దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif