Andhra Pradesh: రాజధానిపై మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు, తీర్పు ఊహించిందే.. త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతాం, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని తెలిపిన మంత్రి

సమావేశం అనంతరం ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.హైకోర్టు తీర్పు మేం ఊహించిందేనని, తీర్పులో కొత్తదనం ఏమీ లేదని పేర్కొన్నారు.

botsa-satyanarayana (Photo-Video Grab)

Amaravati, Mar 3: రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (High Court Verdict ) షాకిచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాదు రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని తెలిపింది. హైకోర్టు తీర్పుపై బొత్స, మోదుగుల తదితరులు అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కూడా పాల్గొన్నారు. తాజాగా ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.హైకోర్టు తీర్పు మేం ఊహించిందేనని, తీర్పులో కొత్తదనం ఏమీ లేదని పేర్కొన్నారు. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని, శాసనసభలో చట్టాలు చేయకూడదంటే ఎలా అని అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని అన్నారు.

అమరావతి రాజధానిగా ఆరునెలల్లో అభివృద్ధి పనులన్ని పూర్తి చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, మూడు రాజధానుల అంశంపై తుది తీర్పును వెల్లడించిన ధర్మాసనం

మూడు రాజధానులు ఏర్పాటుకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్ధేశమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ విధానమన్నారు.త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతామని వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతామని, మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యమా లేదా చూడాలని పేర్కొన్నారు.