TikTok Star Rafi Shaik Death: టిక్‌టాక్ ఫేమ్ రఫీ షేక్ ఆత్మహత్య, నెల్లూరులో ఉరి వేసుకున్న రఫీ, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు

ఆత్మహత్య వెనుక గల కారణాన్ని వారు ఇంకా నిర్ధారించలేదని నెల్లూరు పోలీసులు తెలిపారు,

representational image (photo-Getty)

Vijayawada, Jan 24: వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉన్న యువకుడు రఫీ షేక్ శనివారం నెల్లూరు పట్టణంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య (Rafi Shaik Died by Suicide) చేసుకున్నాడు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని వారు ఇంకా నిర్ధారించలేదని నెల్లూరు పోలీసులు తెలిపారు. అయితే, కొంతమంది యువకులు తనను వేధిస్తున్నారని రఫీ (TikTok sensation Rafi Shaik) తల్లిదండ్రుల నుండి తమకు ఒక ప్రకటన వచ్చిందని పోలీసులు ధృవీకరించారు.

రఫీ కుటుంబం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అతన్ని కొన్ని రోజుల క్రితం అతని స్నేహితులు కొందరు కిడ్నాప్ చేశారు, ఆ తరువాత అతన్ని విడుదల చేశారు.  పోలీసులకు ఫిర్యాదు చేసినందుకుకు బట్టలు ఊడదీసి కొట్టి, వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడతామని వారు రఫీకి బెదిరింపులు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఏం చేయాలో తెలియక రఫీ ఆత్మహత్యకు చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యుల చెప్పిన విషయాలను పోలీసులు ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదు. అయితే అనుమానాస్పదంగా మరణించిన కేసు కింద దీన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మీడియాను ఉద్దేశించి రఫీ కుటుంబ సభ్యులు అతను ఒక కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్‌లో ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాడని, అక్కడి నుండి సాయంత్రం నారాయణ రెడ్డి పేటలో మరికొంత మంది స్నేహితులను కలవడానికి వెళ్ళానని చెప్పాడు.

టిక్‌టాక్ వీడియోల‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రఫీపై గతంలో పలు రకాలు ఆరోపణలు ఉన్నాయి. 2019లో మరో టిక్‌టాక్ స్టార్ సోనికా కేతావత్‌తో కలిసి రఫీ, మరికొందరు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనిక తీవ్రంగా గాయపడింది. అయితే గాయాలతో చికిత్స పొందుతూ సోనికా హాస్పిటల్‌లో మృతిచెందింది. అయితే తొలుత రోడ్డు ప్రమాదం నుంచి సోనిక చిన్నపాటి గాయాలతోనే బయట పడిందని ప్రచారం జరగింది.

దీంతో కొన్ని రోజుల తర్వాత మళ్లీ నవ్వుతూ అందరి ముందుకు వచ్చి మళ్లీ టిక్ టాక్ చేస్తుందని అంతా ఊహించారు కానీ చనిపోతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలోనే సోనిక మరణం వెనక చాలా రహస్యాలు ఉన్నాయంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు టిక్ టాక్ చేసే ఇతర స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను రఫీ ఖండించారు. టిక్‌టాక్ మీట్ సోనిక తనకు పరిచయమైందని తెలిపారు. తాము మంచి స్నేహితులని.. తన స్నేహితురాలని ఎలా చంపుకుంటామని ప్రశ్నించారు. సోనిక తన లవర్ కాదని వెల్లడించారు. మరోవైపు రఫీకి అనారోగ్యంగా ఉందని అతని ఫ్రెండ్స్ టిక్‌టాక్ ఫ్యాన్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం తీవ్ర దూమారం రేపింది. ఆరోగ్యం పేరిట అమాయకుల నుంచి డబ్బుల వసూలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. కాగా, ఇప్పుడు రఫీ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే రఫీ ఆత్మహత్యకు లవ్ ఎఫైరే కారణమని తెలుస్తోంది. నారాయణరెడ్డి ప్రాంతానికి చెందిన ముస్తఫా, రఫీ ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో అది కాస్తా గొడవకు దారీ తీసింది.

జనవరి 20న రఫీ , యువతిని తీసుకుని టీ తాగేందుకు మనుబోలు వెళ్లాడు. ఆ సమయంలో ముస్తఫా ఆయువతికి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు.రఫీతో కలిసి మనబోలులో ఉన్నానని చెప్పింది ఆయువతి. ఇద్దరూ కలిసి నాలుగవ మైలు దగ్గరకు రావాలని చెప్పాడు. టీ తాగీన తర్వాత రఫీ, యువతి ఇద్దరూ కల్సి నాల్గవ మైలు వద్ద ఉన్న అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు.

అక్కడే ఉన్న ముస్తఫా రఫీ పై దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన రఫీని అతని తండ్రి రియాజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకుని 21వ తేదీన నెల్లూరు రూరల్ పోలీసులకు ముస్తఫా పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ఫ్రారంబించారు.

తనపై పోలీసు కేసు పెట్టినట్లు తెలుసుకున్న ముస్తఫా రఫీని బెదిరించ సాగాడు. కేసు వాపస్ తీసుకోకపోతే రఫీకి సంబంధించిన పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో జనవరి 22శుక్రవారం రాత్రి రఫీ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే రఫీ ప్రాణాలువదిలినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు