Prank Video on Tirumala: ప్రాంక్ వీడియో తెచ్చిన తంటా..తమిళ యూట్యూబర్ అరెస్టు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఫ్రాంక్ చేసి అందరి విమర్శలకు గురయ్యాడు ఓ తమిళ యూ ట్యూబర్.
Vij, July 16:ఫ్రాంక్ వీడియో తెచ్చిన తంటా ఓ యూ ట్యూబర్‌ను కటకటలా పాలు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఫ్రాంక్ చేసి అందరి విమర్శలకు గురయ్యాడు ఓ తమిళ యూ ట్యూబర్. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన యూట్యూబర్ వి. వైకుంఠవాసన్ ,అతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఆలయ గౌరవానికి భంగం కలిగించడం, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా ప్రాంక్ వీడియోని రూపొందించారు. అప్పటికే కంపార్టుమెంట్లలో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగా వెకిలి నవ్వు నవ్వుతూ పరుగులు పెట్టారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు.
ఈవీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లుగానే టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యూ ట్యూబర్‌ని అరెస్ట్ చేశారు తిరుమల పోలీసులు.