Delhi, Jul 16: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు. ఇక ఇదే కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
మార్చి 15న మద్యం కుంబకోణం కేసులో కవితను అరెస్ట్ చేశారుఈడీ అధికారులు. ఇక ఆమెను తీహార్ జైలుకు తరలించగా ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత పాత్రకు సంబంధించి పలు ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. తెలంగాణ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన రేవంత్...18 సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు.
Here's Tweet
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
--- జైలు నుంచి దీన్ దయాల్ హాస్పిటల్‌కు
--- హాస్పిటల్‌కు తరలించిన జైలు సిబ్బంది
--- ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో
--- తిహార్ జైలులో ఉన్న కవిత
--- దాదాపు 4 నెలలుగా జైలులోనే కవిత #mlckavitha #DelhiLiquorScam #Tolivelugu pic.twitter.com/NW7GLAW9hI
— Tolivelugu Official (@Tolivelugu) July 16, 2024
విచారణ సమయంలో సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. అయితే ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేశారు సీబీఐ తరపు న్యాయవాది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది. విచారణ సమయం దగ్గర పడుతున్న తరుణంలో కవిత అస్వస్థతకు గురయ్యారు.
Here's Tweet
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
--- జైలు నుంచి దీన్ దయాల్ హాస్పిటల్‌కు
--- హాస్పిటల్‌కు తరలించిన జైలు సిబ్బంది
--- ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో
--- తిహార్ జైలులో ఉన్న కవిత
--- దాదాపు 4 నెలలుగా జైలులోనే కవిత#mlckavitha #DelhiLiquorScam #RTV pic.twitter.com/86BcV8RfJx
— RTV (@RTVnewsnetwork) July 16, 2024
తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
దీన్ దయాల్ ఆసుపత్రికి తరలింపు
డీల్లీ లిక్కర్ కేసులో 100 రోజులపైగా తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత.#mlckavitha #kalvakuntlakavitha #thiharjail #newslineupdate pic.twitter.com/hAIUOlQYI6
— News Line Telugu (@NewsLineTelugu) July 16, 2024