MP Balli Durga Prasad Rao Dies: తిరుపతి ఎంపీ కన్నుమూత, కరోనాతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బల్లి దుర్గాప్రసాద్ రావు‌, గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు (Tirupati MP Balli Durga Prasad) తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tirupati MP Balli Durga Prasad (photo-Twitter)

Amaravati, Sep 16: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌(64) బుధవారం కరోనాతో పాటు గుండెపోటు రావడంతో (MP Balli Durga Prasad Dies) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్ రావు‌కు (Tirupati MP Balli Durga Prasad) తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.

సీఎం జగన్‌ సంతాపం

బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్‌ కుమారుడితో ఫోన్‌ మాట్లాడిన సీఎం జగన్‌.. ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల