Tirupati Woman Murder Case: తిరుపతి వృద్ధురాలు దారుణ హత్య కేసులో ఊహించని మలుపు, నగలను దోచుకోవడానికి దాడి జరగలేదని తెలిపిన ఎస్పీ సుబ్బారాయుడు, వీడియో ఇదిగో..

ముసుగు వేసుకొని ఇంట్లో చొరబడి...వృద్ధురాలు, అడొచ్చిన మహిళ మనువరాలు, మరో యువతిని కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధురాలు భాగ్యలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు.

Tirupati Woman Murder Case and SP Subbarayudu (Photo-Video Grab)

Tiruapati, July 19: తిరుపతిలోని రాయల్‌నగర్‌లో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. ముసుగు వేసుకొని ఇంట్లో చొరబడి...వృద్ధురాలు, అడొచ్చిన మహిళ మనువరాలు, మరో యువతిని కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధురాలు భాగ్యలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. బాలికకు తీవ్రగాయాలు కాగా, మరో యువతి స్వలంగా గాయపడింది. వీరిద్దర్నీ రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

ఈ ఘటన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం..‘తిరుపతిలోని రాయల్‌ నగర్‌లో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాము. జయలక్ష్మీ(67) అనే వృద్దురాలిని దుండగుడు హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్‌ వేసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం, ఆమెను చంపి పారిపోయే క్రమంలో మృతురాలి మనుమరాలు నియతి(14) గొంతుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కోడలు సురక్షపై కూడా దాడి చేశాడు.

Here's Video

ఇక, ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్‌ దొరికాయి. సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయి. ఈ దాడి నగలను దోచుకోవడానికి దాడి జరగలేదు. త్వరలోనే ఈ కేసు మిస్టరీని చేధిస్తాము. వీలైనంత తొందరగానే నిందితుడిని పట్టుకుంటాము’ అని తెలిపారు.



సంబంధిత వార్తలు