Case Booked Against Nara Lokesh: నారా లోకేష్‌పై కేసు నమోదు, అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపినందుకు ఐపీసీ 279,184, 54ఎ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు

రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.

Case Booked Against Nara Lokesh (Photo-Twitter)

Amaravati, oct 27: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పిన (Tractor Accident) సంగతి విదితమే. పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా లోకేష్ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడపారు. ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకేష్ ( Nara Lokesh) పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు (Undi MLA Mantena Ramaraju) వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ట్రాక్టర్‌ను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు (Case Booked Against Nara Lokesh) నమోదైంది. రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో లోకేష్‌పై ఐపీసీ 279,184, 54ఎ, ఎపిడమిక్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటించలేదని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

అకౌంట్లో రూ. 2 వేలు పడినట్లుగా మెసేజ్ చూసుకోండి, రెండవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన ఏపీ సర్కారు, 50,47,383కి చేరుకున్న లబ్ది దారుల సంఖ్య

Here's Tractor Accident Update: 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఇటీవల గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేష్ పర్యటించారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు రాజ్యం తెస్తా అన్న జగన్ రెడ్డి గారు రైతు లేని రాజ్యం తెస్తున్నారని లోకేష్ ఆరోపించారు. రైతులు టీషర్టు వేసుకుంటారా?టర్కీ టవల్ వేసుకుంటారా అని రైతుల్ని జగన్ రెడ్డి గారు అవమానించారని విమర్శించారు. సీఎం జగనల్ పాలనలో రైతుకి గోచి మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతులు టీషర్టు వేసుకుంటారా?టర్కీ టవల్ వేసుకుంటారా అని రైతుల్ని జగన్ రెడ్డి గారు అవమానించారని విమర్శించారు.