Tirumala Sarvadarshan: తిరుమలలో ఐదురోజుల పాటూ సర్వదర్శనం టోకెన్లు రద్దు, శ్రీవారి దర్శనానికి ఏకంగా 48 గంటలు సమయం, పెరటాసి అమవాస్య నేపథ్యంలో భారీగా పెరిగిన రద్దీ

అక్టోబర్ లో ఐదు రోజులు సర్వదర్శనం (Tirumala Sarvadarshan) టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసింది. సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అధిక రద్దీ కారణంగా అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ (TTD) పేర్కొంది.

Tirumala (Credits: Twitter)

Tirumala, SEP 30: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఐదు రోజులు సర్వదర్శనం (Tirumala Sarvadarshan) టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసింది. సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అధిక రద్దీ కారణంగా అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ (TTD) పేర్కొంది. భక్తులు టోకెన్లు తీసుకునే విషయంలో ఈ తేదీలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.  గత కొన్ని రోజులుగా తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు 25 గంటలకుపైగా సమయం పడుతుంది.

 

మరోవైపు టీటీడీ తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలించింది. శుక్రవారం నుంచి ద్విచక్ర వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో అనుతించింది . గతంలో మాదిరిగా యథావిధిగా ద్విచక్ర వాహనాలను రాత్రి 10 గంటల వరకు తిరుమల కొండపైకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్య మృగాల సంచారం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా, గతంలో చిరుత పులులు అర్ధరాత్రి సమయంలో కాలి నడకన కొండపైకి వెళ్లున్న భక్తులపై దాడి చేశాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న భక్తులపై సైతం దాడికి యత్నించాయి.