Ramana Deekshitulu On TTD Laddu: నెయ్యి కల్తీ బాధాకరమన్న రమణ దీక్షితులు, నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్, ఆగమ శాస్త్రం ప్రకారం పరిహారం చేయాలని సూచన
దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనమే కాదు లడ్డూ కూడా ఫేమస్. శ్రీవారి లడ్డూ కోసం ఎగబడతారు కూడా. అయితే అలాంటి శ్రీవారి లడ్డూ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Vij, Sep 20: కళియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారన్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీవారి దర్శనమే కాదు లడ్డూ కూడా ఫేమస్. శ్రీవారి లడ్డూ కోసం ఎగబడతారు కూడా. అయితే అలాంటి శ్రీవారి లడ్డూ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల జంతువుల నూనెతో లడ్డూను తయారు చేశారని చంద్రబాబు కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై స్పందించారు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు.నెయ్యి కల్తీ జరగడం చాలా విచారకరమని అన్నారు. నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు..గతంలో ఇటువంటి తప్పులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో నాపై కేసులు పెట్టారని ఆరోపించారు. శ్రీవారి ఆలయంలో ఇటువంటి తప్పులు జరిగితే ఆగమశాస్త్రం ప్రకారం పరిహారం చేయాలన్నారు. తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, ఆధారాలు ఇవిగో అంటూ బయటపెట్టిన టీడీపీ, ఖండించిన వైసీపీ
Here's Video:
చాలా సార్లు నైవేద్యాలు క్వాలిటీ లేదని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు అన్నారు. తిరుమలలో సేవ చేయడానికి ఆగమాలు తెలిసిన వారిని సేవకులుగా నియమించాలని.... ప్రసాదాల విషయంలో వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగాలని డిమాండ్ చేశారు. తనకు అవకాశం ఇస్తే ఇటువంటివి సరిదిద్దుతాను అని చెప్పారు. తనపై ఉన్న తప్పుడు కేసులు ఈ ప్రభుత్వం తొలగించాలి. కేసులు తొలగిస్తే నేను మళ్లీ స్వామివారి సేవ చేయడానికి సిద్ధమని వెల్లడించారు.