Union Budget 2024: ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చి అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తాం, అప్పుగా ఇస్తున్నారా, నిధులా అనే అంశంపై స్పష్టత ఇచ్చిన నిర్మలా సీతారామన్
అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు
New Delhi, July 23: కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ 15 వేల కోట్లు కేంద్రం కేటాయించడం తెలిసిందే. అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ తెలుగు చానల్ ప్రతినిధి అమరావతి, పోలవరం గురించి ఆమెను ప్రశ్నించారు.
అందుకు నిర్మల బదులిస్తూ... ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం కూడా ఉందని వెల్లడించారు. "ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. దాని ప్రకారం మేం తప్పనిసరిగా ఏపీకి సాయం అందించాలి. ఇప్పుడు మేం అమరావతికి కేటాయించిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు సహకారంతో అందిస్తున్నాం. దానికి తదనంతర నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు
దీనిపై మేం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళతాం. ఎందుకంటే ఇప్పటికే ఏపీకి రాజధాని లేకుండా పదేళ్లు గడచిపోయాయి. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉందంటే, దానికి రాజధాని ఉండాలి. కానీ రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం ఆంధ్రా. దీనికి కారకులు ఎవరు? అనే అంశం జోలికి నేను వెళ్లదలచుకోలేదు. రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది" అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Here's Video
అంతకుముందు, పోలవరం ప్రాజెక్టు అంశంపైనా నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఆ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సాధారణంగా జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని, కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తోందని, అందువల్ల పోలవరం అంశంలో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని వివరించారు.