Vangaveeti Radha:నన్ను చంపేందుకు రెక్కీ చేశారు, త్వరలోనే పేర్లు బయటకు వస్తాయి, వంగవీటి రాధా సంచలన కామెంట్లు, ఒక్కచోట కలిసిన పాత మిత్రులు
తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని బాంబ్ పేల్చారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో రాధా ఈ కామెంట్లు చేశారు. నన్ను చంపేందుకు రెక్కీ(recce done to kill me) నిర్వహించారు, వారిని చూసిన భయపడను, ప్రజల్లోనే ఉంటా, నాపై రెక్కీ చేసినవారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని వంగవీటి రాధా అన్నారు.
Vijayawada December 26: కాపునేత వంగవీటి రాధా(Vangaveeeti Radha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని బాంబ్ పేల్చారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో రాధా ఈ కామెంట్లు చేశారు. నన్ను చంపేందుకు రెక్కీ(recce done to kill me) నిర్వహించారు, వారిని చూసిన భయపడను, ప్రజల్లోనే ఉంటా, నాపై రెక్కీ చేసినవారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని వంగవీటి రాధా అన్నారు.
గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా(vangaveeti mohana ranga) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి రాధా, వల్లభనేని వంశీ(Vallabhaneni vamshi) కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గుడివాడ దగ్గరలోని కొండలమ్మ గుడిలో మంత్రి కొడాలి నాని(Kodali Nani), వంశీ(Vamshi), రాధా(Radha) కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఎప్పటి నుంచో వీరు ముగ్గురు స్నేహితులుగా ఉన్నారు. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. అసలే వైసీపీకి, టీడీపీకి రాజకీయ యుద్ధం పీక్‌లో ఉన్న టైమ్‌లో ఈ ముగ్గురు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం టాక్ ఆఫ్ ది కృష్ణా టౌన్‌గా మారింది.
అయితే రంగ వర్థంతి సభలో రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది ఎవరని అంతా చర్చించుకుంటున్నారు.