Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి

కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు.

Polavaram Project is ATM For Chandrababu Says YSRCP MP Vijayasai Reddy(X)

Vjy, Dec 5: కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్‌ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్‌ అంటూ ధ్వజమెత్తారు.

వైఎస్‌ జగన్‌తో సహా వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, లిక్కర్ స్కాంలో జైల్లో ఉండి వచ్చిన శరత్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి కేవీ రావుపై బెదిరింపులకు దిగారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించడం తెలిసిందే. కేవీరావు గొంతుమీద కత్తిపెట్టి రూ. 2వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను రూ.12 కోట్లకు, కాకినాడ సీ పోర్టులో రూ. 2,689 కోట్ల విలువైన షేర్లను రూ. 494 కోట్లకే కొట్టేశారని వివరించారు. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కేవీ రావును విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డిది చిన్న వయసు... కేవీ రావు భారీ మనిషి! విక్రాంత్ రెడ్డి లాంటి వాడు కేవీ రావును బెదిరించడమేంటి... నాకర్థం కావడంలేదు. మరి విక్రాంత్ రెడ్డి భయపెడితే కేవీ రావు భయపడ్డాడా? ఆ కేవీ రావు సంవత్సరంలో ఆరేడు నెలలు అమెరికాలోనే ఉంటాడు. సింగపూర్ లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఇలాంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడంటే నమ్మొచ్చా?

పైగా, రెండు చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు నాకు నామినీలు అని ఆరోపిస్తున్నారు. నేను 2020 మేలో ఈ బ్రోకర్ కేవీ రావుకు ఫోన్ చేసి... విక్రాంత్ రెడ్డి వస్తాడు... కాకినాడ సీ పోర్ట్ గురించి మాట్లాడతాడు అని చెప్పానంట. చంద్రబాబుకు బుద్ధి మందగించిందా? అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే, చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు నామినీలు ఉండరు. నామినీలు ఉండేది బ్యాంకు అకౌంట్లకేనన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోతే ఇంకెలా అర్థం చేసుకోవాలి?

కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు

వాస్తవాలు ఏంటంటే... కాకినాడ పోర్టును నాడు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పోర్టును చంద్రబాబు ప్రైవేటు రంగానికి అప్పగించేశారు. అప్పటి మలేసియా ప్రధాని కుమారుడు ఈ పోర్టును కొంటున్నారని ప్రచారం చేశారు. కానీ ఆ ముసుగులో కాకినాడ సీ పోర్టును కేవీ రావుకు అప్పగించారు. కేవీ రావును సీఎండీగా చేశారు.

కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో తెలియాలంటే 1997 నుంచి జరిగిన పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. చంద్రబాబు అందరినీ క్రిమినల్స్ అంటుంటాడు... చంద్రబాబే ఒక క్రిమినల్. అలాంటి చంద్రబాబుకు ఈ బ్రోకర్ కేవీ రావు ఒక చెంచా. కేవీ రావుకు నిజంగానే అన్యాయం జరిగి ఉంటే అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?

ఇప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు... నా మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందున చంద్రబాబు, కేవీ రావుపై పరువునష్టం దావా వేయాలనుకుంటున్నాను" అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Share Now
Advertisement