Visakha Constable Murder Case: కానిస్టేబుల్‌ భర్తకి మద్యం తాగించి ప్రియుడితో కలిసి చంపేసిన భార్య, విశాఖ హత్య కేసులు వీడిన మిస్టరీ

కానిస్టేబుల్ రమేష్‌ను తన భార్య శివజ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమవర్మ మీడియాకు వెల్లడించారు.

City Commissioner Trivikram Reveals Constable Ramesh Murder Case, wife kill him on her Extra marital affair

Visakhapatnam, August 4: విశాఖలో సంచలనం సృష్టించిన వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కానిస్టేబుల్ రమేష్‌ను తన భార్య శివజ్యోతి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సీపీ త్రివిక్రమవర్మ మీడియాకు వెల్లడించారు.

సీపీ త్రివిక్రమ్‌ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్‌ రమేష్‌ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్‌ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రమేష్‌ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్‌.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం.

దారుణం, 14 ఏళ్ల నుంచి 1000 సార్లు యువతిపై అత్యాచారం, పార్టీకి పిలిచి అమ్మాయిని సెక్స్ బానిసగా మార్చుకున్న కామాంధుడు

ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్‌ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్‌తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్‌ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్‌ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్‌ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రామారావును చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు.

అయితే.. రమేష్‌, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్‌ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి పిల్లలు, రమేష్‌ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.