Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

మాస్కో, ఆగస్టు 2: పశ్చిమ రష్యాలోని (Russia) చెల్యాబిన్స్క్‌ ప్రాంతానికి చెందిన కామాంధుడు ఓ యువతిని 14 ఏళ్లు తన ఇంట్లో నిర్బంధించాడు. ఏకంగా ఆ యువతిని సెక్స్ బానిసగా (Kept Her As Sex Slave In His House) మార్చుకున్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల ఆ మహిళ తనను 2009 నుంచి బందీగా (Russia Man Kidnapped Teen) ఉంచి 1,000 సార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది.

51 ఏళ్ల వ్లాదిమిర్ చెస్కిడోవ్ అనే వ్యక్తి 2011లో అదే ఇంట్లో మరో మహిళను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మొదటి పేరు ఎకటెరినాతో మాత్రమే గుర్తించబడిన మహిళ తప్పించుకుని పోలీసుల దగ్గరకు వెళ్లడంతో అతన్ని అరెస్టు చేశారు.

ఆ కామాంధుడు ఆమెను పలురకాలుగా హింసిస్తూ తన లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. నిందితుడి తల్లి సాయంతో ఆ మహిళ మురికి కూపం నుంచి బయటపడింది. ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ క్రూరుణ్ని అరెస్టు చేశారు. తాను 2009లో నిందితుడి ఇంటికి వెళ్లానని బాధిత మహిళ చెప్పింది. అతడు పెడుతున్న లైంగిక హింసను భరించలేక ఎదురు తిరగడంతో ఓ గదిలో బంధించాడని వాపోయింది.

ప్రియుడు కాదు కామాంధుడు, ఆ ఫోటోలను చూపిస్తూ స్నేహితులతో కలిసి ప్రియురాలిపై పదే పదే అత్యాచారం

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. 51 ఏళ్ల నిందితుడు వ్లాదిమిర్‌ చెస్కిడోవ్‌ ఆల్కహాల్‌ తాగుదామని బాధితురాలిని తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆమెను అడుగు బయట పెట్టకుండా అదే ఇంటిలో బంధించాడు. ఆమె చేత అన్ని పనులు చేయించేవాడు. చిన్న చిన్న విషయాలకే అతి దారుణంగా కొట్టి హింసించేవాడు.

కొద్ది రోజుల తర్వాత నిందితుడు మరో మహిళను తన ఇంటికి తీసుకొచ్చాడు. 2011లో వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో ఆమెను చంపేశాడు. పలుమార్లు కత్తితో కసితీరా పొడిచి.. నెయిల్‌ పుల్లర్‌తో ప్రాణాలు తీశాడు. ఇటీవల ఆ సైకో మానసిక ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఉండటంతో.. బాధితురాలికి తప్పించుకునే అవకాశం లభించింది.

దారుణం, శృంగారానికి నిరాకరించిందని అత్త తలను గోడకేసి బాది చంపిన అల్లుడు, అనంతరం పని ముగించుకుని..

చెస్కిడోవ్‌పై ఫిర్యాదు రావడంతో పోలీసులు స్మోలినో గ్రామంలోని అతడి ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ సెక్స్‌ టాయ్స్‌, మజిల్స్‌, పోర్న్‌ సీడీలు దొరికాయి. ఇంట్లో పూడ్చిన కొన్ని మానవ శరీర అవశేషాలను స్వాధీనం చేసుకున్నామని రష్యా ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ పేర్కొంది. దాంతో నిందితుడిపై రేప్‌, మర్డర్‌, కిడ్నాప్‌ కేసులు నమోదు చేశారు. అతడు ప్రస్తుతం మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఆ ఆస్పత్రి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.