Visakhapatnam: మృతదేహంతో గంగవరం పోర్టు వద్ద గ్రామస్తులు నిరసన, మృతుని కుటుంబానికి యాజమాన్యం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్

మృతుడు అప్పారావుగా గుర్తించారు. ఓరియన్‌ ఓర్‌, బొగ్గు రేవు కాలుష్యంతో గంగవరం గ్రామం రోజురోజుకూ కలుషితమవుతోందని, దీంతో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని మృతుని బంధువులు ఆరోపించారు.

Gangavaram Port (Photo Credit: X/@jaideepshenoy)

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: కడుపునొప్పితో మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కార్మికుని గ్రామస్తులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి మృతదేహంతో గంగవరం పోర్టు గేటు ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడు అప్పారావుగా గుర్తించారు. ఓరియన్‌ ఓర్‌, బొగ్గు రేవు కాలుష్యంతో గంగవరం గ్రామం రోజురోజుకూ కలుషితమవుతోందని, దీంతో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని మృతుని బంధువులు ఆరోపించారు.

హాస్టల్లో విగతజీవిగా కనిపించిన ఇంటర్‌ విద్యార్థిని, ప్రిన్సిపల్ మా కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణ

గనగవరం పోర్టు యాజమాన్యం కార్మికులు, గ్రామస్తుల కోసం ఆస్పత్రిని నిర్మించలేదని ఆరోపించారు. భారతదేశంలోని ప్రతి కంపెనీకి ఆసుపత్రి ఉంటుంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు వైద్యసేవలు అందజేస్తారని చెబుతున్నా ఇక్కడ అదానీ గంగవరం పోర్టుకు సంబంధించిన ఆస్పత్రి లేదు. గంగవరం పోర్టుకు భూములిచ్చిన గంగవరం గ్రామస్తులు.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం మా జీవితాలతో ఆటలాడుతోంది.. మేం (గ్రామస్తులు) ఎన్నిసార్లు ధర్నాలు చేసినా గంగవరం పోర్టు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్థులకు వైద్య సహాయం అందించాలని, మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.