Vivekananda Reddy Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ వాయిదా, రేపు ఉదయం 10. 30 గంటలకు రావాలంటూ మరో నోటీసు పంపిన సీబీఐ అధికారులు

ఆయనను మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు పిలిచారు.

YS Avinash Reddy (photo-Video Grab)

Hyd, April 17: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఆయనను మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు పిలిచారు. ఈ మేరకు సీబీఐ అదనపు ఎస్పీ ముఖేశ్‌ శర్మ వాట్సాప్‌లో అవినాష్‌కు సీఆర్పీపీసీ 160 కింద మరో నోటీసు పంపారు. దీంతో సీబీఐ కార్యాలయం నుంచి మధ్యలోనే అవినాష్‌ వెనుదిరిగారు.

వివేకానందరెడ్డి హత్య కేసు, 2019 నుంచి నేటి వరకు ఏం జరిగింది, నాలుగేళ్లు దాటినా ఇంకా బయటకు రాని అసలు నిజం

తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉన్నందునే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన అవినాష్‌ రెడ్డి, నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ

మరోవైపు ఈ కేసులో అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు నిన్న అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆయనకు సీబీఐ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో భాస్కర్‌రెడ్డిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.