Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ
ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు.
Vizag, Sep 30: విశాఖపట్టణం (Vizag) తీరానికి ఇటీవల ఓ పెద్ద పురాతన పెట్టె (Ancient Box) ఒకటి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా (Mystery) మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. ఆ పెట్టెలో విలువైన సంపద ఏదో ఉండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. వైఎంసీఏ బీచ్‌లోకి పెట్టె కొట్టుకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానికి కాపలాగా ఉన్నారు. పెట్టెను ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు వచ్చి పెట్టెను తెరిచే అవకాశం ఉందని, వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టు చెబుతున్నారు.
Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన
లోపల ఏముంటుందో?
ఇంత భారీ పెట్టె విశాఖ సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. లోపల ఏముందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.