Vizag Horror: కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన

పిల్లల అల్లరి మాన్పించేందుకు సూసైడ్ చేసుకుంటా అంటూ ఓ తండ్రి చేసిన ప్రయత్నం దారుణంగా వికటించింది.

Man commits suicide by mistaken

Visakhapatnam, July 19: భయపెట్టాలని మనం చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాలమీదకే వస్తాయి. పిల్లల (Children) అల్లరి మాన్పించేందుకు సూసైడ్ (Suicide) చేసుకుంటా అంటూ ఓ తండ్రి చేసిన ప్రయత్నం దారుణంగా వికటించింది. దీంతో అతడి మెడకు ఉరి పడింది. విశాఖలో (Visakhapatnam) ఈ దారుణం వెలుగు చూసింది. బీహార్‌ కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్. ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. బుధవారం రాత్రి చందన్ ఇంటికి రాగానే ఏడేండ్ల కుమార్తె, ఐదేండ్ల కుమారుడి అల్లరి శృతి మించింది. అప్పటికే విసుగ్గా ఉన్న చందన్ తన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లు చిరిగి ఉండటం గమనించాడు. ఇదంతా పిల్లల పనేనని గ్రహించాడు. దీంతో వారిపై చిరాకు పడ్డాడు.

వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?

ఆత్మహత్య చేసుకుంటానని..

అయితే, పిల్లలపై చిరాకు పడుతున్న చందన్‌ కు భార్య అడ్డుపడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ బెదిరించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. కుటుంబసభ్యులను భయపెట్టాలని ఇంట్లోని ఫ్యాన్‌ హుక్‌ కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని చనిపోతానని నటించబోయాడు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక గిలగిలాకొట్టుకొని మరణించాడు. అతన్ని కాపాడాలన్న భార్య ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది.

వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు