AP Assembly Session: సీఎం జగన్ ఒక ఉన్మాది, జీవో 2430 ఎత్తివేయాలంటూ చంద్రబాబు విమర్శలు, చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు, 40 ఏళ్ల అనుభవం ఉన్నా ఇంగిత జ్ఞానం లేదంటూ సీఎం జగన్ కౌంటర్
సభా నాయకుడి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు....
Amaravathi, December 12: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Winter Session 2019) కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభం కాగానే సీఎం జగన్ (CM Jagan) పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సభలో దుమారం చెలరేగింది. అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మీడియాపై ఆంక్షలు విధించే 'జీవో 2430' రద్దు చేయాలంటూ అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. మూడు మీడియా ఛానెల్స్ నిషేధం, సభలోకి వాటిని అనుమతించకుండా సీఎం జగన్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్లకార్డులతో అసెంబ్లీకి వస్తున్న టీడీపీ సభ్యులను అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులు- మార్షల్స్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో " సీఎం జగన్ ఒక ఉన్మాది అయితే, మీరూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారా" అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
అటుపై అసెంబ్లీలోకి వచ్చిన టీడీపీ సభ్యులు మార్షల్స్ పై సభలో ఫిర్యాదు చేశారు. సభను వాయిదా వేసి మార్షల్స్ పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సభలో ఉండలేమని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో సభావ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ , సభలో మరియు అసెంబ్లీ ప్రాంగణంలో సభ్యులు ఎలా వ్యవహరించాలి అనే వ్యవహారంపై టీడీపై హయాం నుంచే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే మార్షల్స్ నడుచుకున్నారని చెప్పారు.
కాగా, సీఎం జగన్ ఉన్మాది అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియోలను సభలో అధికార సభ్యులు ప్రదర్శించారు. సభా నాయకుడి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఎథిక్స్ కమిటీ వేయాలని స్పీకర్ ను కోరారు. నాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంటా, నా పవర్ పాయింట్లకు ప్రపంచం మెచ్చింది.
ఇక జీవో 2430 రద్దు చేయాలంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలపై సీఎం జగన్ దీటుగా బదులిచ్చారు. ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకొచ్చేలా తప్పుడు కథనాలు, దురుద్దేశపూరిత కథనాలు, ఉన్నది లేనట్లు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే భరించాలా? ఈనాడు, ఆంధ్రజ్యోతిలి చంద్రబాబు సన్నిహితులు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
చంద్రబాబు అసలు 2430 జీవోను చదివారా? అందులో ఏం తప్పుంది? నాకు తెలిసి చంద్రబాబుకి ఇంగ్లీషు రాక ఆ జీవోను అర్థం చేసుకోలేక వ్యతిరేకిస్తున్నట్లు భావిస్తున్నానని జగన్ అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి ఇంగిత జ్ఞానం లేదని జగన్ ఎద్దేవా చేశారు.