COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 295 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,822గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీకి అని ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

సంక్రాంతి కంటే ముందే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. కోవిడ్ టీకాకి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, 104కి ఫోన్ చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు....

Coronavirus Cases in AP (Photo Credits: PTI)

Amaravati, January 7: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది, ఇటీవల కాలంగా ప్రతిరోజు రెండు- మూడు వందల కొత్త కేసులు వస్తున్నాయి. ఇక కేంద్రం నుంచి అనుమతులు రాగానే రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్రాంతి కంటే ముందే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. కోవిడ్ టీకాకి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, 104కి ఫోన్ చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  59,410 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,84,171కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,81,276గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి 45, చిత్తూరు నుంచి 39 కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మకరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7126కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 368 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,74,223 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,822 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.