AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న కరోనా ఆక్టివ్ కేసులు, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 500 మందికి పాజిటివ్, మరో 563 మంది రికవరీ

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 88, కృష్ణా జిల్లా నుంచి 77, గుంటూరు నుంచి 55, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 47 కొత్త కేసులు నమోదయ్యాయి....

Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

Amaravati, December 15: ఒకప్పుడు కొవిడ్ కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మహమ్మారి నియంత్రించడంలో పెద్ద విజయం సాధించింది. ప్రతిరోజు సాధారణ స్థాయిలోనే కేసులు వస్తుండటం, కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  61,452 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 500 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,76,336కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,73,441గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 88,  కృష్ణా జిల్లా నుంచి 77,  గుంటూరు నుంచి 55, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 63, 47   కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7064కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 563 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,64,612 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 4,660 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif