Narasaraopet Shocker: భర్త నిద్రపోతుండగా పెట్రోలు పోసి తగలబెట్టేసింది, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కిరాతకం, నరసరావుపేటలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ దారుణ ఘటన నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంలో (Narasaraopet Shocker) జరిగింది అక్కడి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన మద్దమాల చెంచయ్య (42), అన్నమ్మ దంపతులు. వారికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చెంచయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు.

Representational Image | (Photo Credits: PTI)

Guntur, Mar 27: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి ఓ మహిళ నిప్పంటించింది. ఈ దారుణ ఘటన నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంలో (Narasaraopet Shocker) జరిగింది అక్కడి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన మద్దమాల చెంచయ్య (42), అన్నమ్మ దంపతులు. వారికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చెంచయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు.

కాగా అన్నమ్మకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవులు జరిగేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి నిద్రపోయేందుకు అన్నమ్మ తన భర్త చెంచయ్యను డాబాపైకి తీసుకెళ్లింది. చెంచయ్య గాఢనిద్రలో ఉండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అన్నమ్మ అతడిపై పెట్రోల్‌ పోసి (woman poured petrol on her sleeping husband) నిప్పంటించింది. ఒక్క సారిగా ఒంటికి మంటలు అంటుకోవడంతో చెంచయ్య పెద్దగా కేకలు వేశాడు.

నన్నే రేప్ చేస్తావా..రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన యువతి, నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎంపీ పోలీసులు, నాపై కొడవలితో దాడి చేసిందని మహిళపై ఫిర్యాదు చేసిన నిందితుడు

తండ్రి అరుపులు విని ఇంటిలో నిద్రిస్తున్న అతని కుమారుడు మనోహర్, చుట్టుపక్కల హుటాహుటిన డాబాపైకి చేరి మంటలు అర్పి, తీవ్రంగా గాయపడిన చెంచయ్యను 108 అంబులెన్స్‌లో పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో చెంచయ్య మృతిచెందాడు. చెంచయ్య కుమార్తెకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. భర్తపై పెట్రోలుపోసి నిప్పటించిన అన్నమ్మ పరారీలో ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ రోశయ్య తెలిపారు.