Posani Comments on CBN: జ‌య‌ప్ర‌ద జీవితాన్ని చంద్ర‌బాబు నాశ‌నం చేశాడు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి

అందుకే నిమ్మగడ్డతో (Nimmagadda) ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు.

Posani krishna Murali (Photo-Video Grab)

Vijayawada, April 10: వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అన్నారు. అందుకే నిమ్మగడ్డతో (Nimmagadda) ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబుది (Chandrababu) మొసలి కన్నీరు అని పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అన్నారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇండ్ల తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేశ్‌లా తాగుబోతులు, తిరుగుబోతులు కాదని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఒక మనవడిలా, అన్నలా, బిడ్డలా తోడుంటారు తప్ప.. నీ కొడుకులా ఓ పక్క పళ్లెం.. మరో పక్క గొళ్లెం మెయింటైన్‌ చేయరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh Elections 2024: హిందూపురంలో వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ 

జయప్రద లాంటి పెద్ద హీరోయిన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఇల్లాలిని బజారుకు ఈడ్చాడని అన్నారు. ఇదంతా చంద్రబాబు అండ్‌ కో హయాంలోనే జరిగిందని అన్నారు. వీళ్లందరికీ ఆడవాళ్లంటే చాలా చీఫ్‌ అని విమర్శించారు. ఇందుకు బాలకృష్ణ మాటలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆడది కనిపిస్తే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలని బాలకృష్ణ గతంలో అన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు కొడుకు తాగుబోతు, తిరుగుబోతు అని మండిపడ్డారు. అలాంటి వారిని వైసీపీలో చూపించగలరా? అని ప్రశ్నించారు. ఈ దొంగ వెధవలను అస్సలు నమ్మవద్దని అన్నారు. వాళ్ల ఏడుపంతా జగన్‌ను దించేయాలని మాత్రమే అని అన్నారు. తాను కమ్మ కులస్తుడు కాబట్టి చంద్రబాబును తిట్టవద్దని కొందరు చెబుతున్నారని.. అవినీతిపరుడు, దొంగ కమ్మవాడైతే మద్దతివ్వాలా? అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పైనా పోసాని నిప్పులు చెరిగారు. అసలు అది ఒక పార్టీయేనా? అని ఎద్దేవా చేశారు. ఒక కూటమి అనుకునేలోపే వాళ్లకు ఇచ్చిన సీట్లలో పవన్‌ కళ్యాణ్‌ తన వాళ్లను నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. గేదెలు కాచుకునేవాడు కూడా పవన్‌ కళ్యాణ్‌ మాటలు నమ్మరని విమర్శించారు. రెండు లక్షల పుస్తకాలు చదివానని అంటావు.. ఏపీలో దేవతల్లాంటి వాలంటీర్ల ఆడపడుచుల్ని ఇలా మాట్లాడటం తగునా? అని ప్రశ్నించారు. ఇంత ఉన్మాదిగా పవన్‌ కళ్యాణ్‌ తయారయ్యాడంటే ఇక దేవుడే కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరిపైనా పోసాని కృష్ణమురళి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఒక టైప్‌ అనుకుంటే.. దగ్గుబాటి పురంధేశ్వరి వంద టైపులు అని విమర్శించారు. ఆమెకు ఆరెస్సెస్‌ అంటే కూడా ఏంటో తెలియదని అన్నారు. సావర్కర్‌ అంటే గవాస్కర్‌ అనుకుంటుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ మీద సీజేఐకి లేఖ రాసిన పురంధేశ్వరి.. మోసాలు చేసిన సుజనా చౌదరి, సీఎం రమేశ్‌పై ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వివిధ కేసుల్లో స్టేలపై బతుకుతున్న చంద్రబాబును జైల్లో పెట్టాలని ఎందుకు లేఖలు రాయడం లేదని మండిపడ్డారు.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif