Andhra Pradesh Shocker: అన్నని, అక్కని నరికేసిన తమ్ముడు, రూ. 5 లక్షల కోసం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన, ఇద్దర్నీ చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

5 లక్షల డబ్బు కోసం తొడబుట్టిన అక్కని, అన్నని ఓ తమ్ముడు చంపేసిన దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పరిహారం విషయంలో తలెత్తిన మనస్పర్థలు కుటుంబంలో దారుణ హత్యకు (younger brother killed his elder brother and elder sister) దారి తీశాయి.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Amaravati, Mar 7: రూ. 5 లక్షల డబ్బు కోసం తొడబుట్టిన అక్కని, అన్నని ఓ తమ్ముడు చంపేసిన దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పరిహారం విషయంలో తలెత్తిన మనస్పర్థలు కుటుంబంలో దారుణ హత్యకు (younger brother killed his elder brother and elder sister) దారి తీశాయి. రణస్థలం మండలం రామచంద్రాపురం గ్రామంలో ( Ramachandrapuram) జరిగిన విషాద ఘటన వివరాల్లోకెళితే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని కొవ్వాడ మత్స్యలేశం పంచాయతీలో గల రామచంద్రాపురం గ్రామంలో గొర్లె సన్యాసిరావు (54), అక్క జయమ్మలు నివసిస్తున్నారు. కాగా వీరి తమ్ముడు రామకృష్ణ అక్కడే వేరేగా ఉంటున్నాడు.

రామచంద్రాపురంలో సన్యాసిరావు కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. సన్యాసిరావు ఇద్దరు అక్కలు అవివాహితులు కావడంతో వారు అన్నతోనే ఉంటున్నారు. ఈ మధ్య కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణంలో భాగంగా ఊరి వారికి పరిహారాలు చెల్లిస్తున్నారు. పరిహారాల పంపిణీలో భాగంగా వీరికి పంపకాలు జరిగిపోయాయి. అయితే అవివాహితులైన మహిళలు ఇంతకు ముందు ఓ పెంకుటింట్లో ఉండేవారు. ఆ ఇంటికి కూడా రూ.16 లక్షల వరకు పరిహారం వచ్చింది. ఆ డబ్బులో తనకు వాటా కావాలని రామకృష్ణ పంచాయతీ పెట్టాడు. ఆడవాళ్ల సొమ్ము మనకు వద్దని అన్న సన్యాసిరావు సర్ది చెప్పినా వినలేదు.

నిప్పంటించుకుని ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణం, మరో చోట బాలికకు గర్భం వచ్చిందని హత్య చేసిన ప్రియుడు, అరెస్ట్ చేసిన పోలీసులు

తన వాటాగా రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనిపై తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఆఖరకు రామకృష్ణకు రూ.5లక్షలు ఇవ్వడానికి సన్యాసిరావు, అక్కలు ఒప్పుకున్నారు. అయితే ఇకపై తమతో ఆర్థిక లావాదేవీలేవీ పెట్టుకోకూడదని, తమను ఏ విషయంలోనూ వేధించకూడదని పెద్ద మనుషుల సమక్షంలో రాత పూర్వకంగా ఒప్పుకోవాలనే డిమాండ్‌ పెట్టారు. ఈ డిమాండ్‌ విషయంలో రామకృష్ణ కోపోద్రిక్తుడయ్యాడు. తానెందుకు సంతకం పెట్టాలంటూ గొడవ పెట్టుకున్నాడు.

గ్రామంలో ఉదయం 5.45 గంటల సమయంలో గొర్లె సన్యాసిరావు తన ఇంటి వ ద్ద ఆవు పాలు పితుకుతుండగా.. వెనక నుంచి వచ్చిన రామకృష్ణ కత్తిలో బలంగా అతడి తలపై వేటు వేశాడు. ఆ తర్వాత కూడా మెడ, ఇతర భాగాలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బాధతో అతను అరుస్తుంటే.. లోపల నుంచి అక్క జయమ్మ బయటకు వచ్చి చూసి నిశ్చేష్టురాలైంది. దివ్యాంగురాలైన ఆమె వచ్చి ప్రతిఘటించగా రామకృష్ణ ఆమెపైనా దాడికి దిగా డు. శరీరమంతా కత్తితో గాయాలు చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది.

వంట రుచిగా వండలేదని స్నేహితుడిని చంపేశాడు, పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే యువకుడు మృతి, గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి, ముంబైలో షాకింగ్ ఘటన

చుట్టుపక్కల వారు చూసి వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయా డు. సన్యాసిరావును ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా కొద్ది దూరం వెళ్లే సరికే ప్రాణాలు వదిలేశాడు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహీంద్ర, సీఐ వి.చంద్రశేఖర్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత నిందితుడు రామకృష్ణ జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ కె.వాసునారాయణ మృతదేహాలను శవ పంచనామాకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సన్యాసిరావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు మే 26న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా తీశారు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు నిందితుడు రామకృష్ణ తన కూతురికి ఓ పోలీసు అధికారితో వివాహం చేయడం గమనార్హం. సన్యాసిరావు మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.