Srikakulam Horror: శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి.. బెల్టుతో దాడి చేసి.. (వైరల్ వీడియో)

ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు.

Srikakulam Horror (Credits: X)

Srikakulam, Dec 6: ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు. ఆర్మీ (Army), నేవీ, ఎయిర్ ఫోర్స్‌ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.5,00,000 నుండి 10,00,000 వరకు డబ్బులు తీసుకొన్న బసవ రమణ అనంతరం వారిని మోసం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి తీసుకున్న ఆ డబ్బును జల్సాలకు ఉపయోగిస్తున్నట్టు సమాచారం.

బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??

Here's Video:

ప్రశ్నిస్తే..

డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగాల గురించి సమాచారం లేకపోవడంతో ఉద్యోగం గురించి అడిగిన బాదితులు, వారి కుటుంబ సభ్యులను తిడుతూ రమణ బెల్ట్‌ తో దారుణంగా కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిందితుడిని శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్