YS Jagan: తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్

గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

YS Jagan Mohan Reddy in Delhi (Photo-ANI)

Vjy, August 5: ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వీడియో ఇదిగో, అర్థరాత్రి వైసీపీ నేతపై కర్రలతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

గతంలో తనకు ఉన్న సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో వైఎస్‌ జగన్‌ కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్టు తెలిపారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, తనకు ఉన్న ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిదని తెలిపారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.