Jagananna Thodu: 5.81 లక్షల మంది లబ్ధిదారు­ల ఖాతాల్లో రూ.13.64 కోట్లు, జగనన్న తోడు పథకం 8వ విడత నిధులు విడుదల ఏపీ సీఎం

జగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ( Jagananna Thodu scheme funds) ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు.

YS Jagan Mohan Reddy releases Jagananna Thodu scheme funds, says the scheme stood as model for state

Vjy, Jan 11: జగనన్న తోడు పథకం 8 వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) గురువారం విడుదల చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి వడ్డీ లేని రుణం ( Jagananna Thodu scheme funds) ఇస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు విడుదల చేశారు.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభు­త్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకు పైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారు­ల్లో ఈ విడతలో () వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారు­లకు రూ.13.64 కోట్లు చెల్లించారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం. కొత్తగా 86 వేల మందికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. రుణాలు తీసుకున్న వారిలో 95 శాతం మంది తిరిగి చెల్లింపులు చేస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు.

జగనన్న తోడు (Jagananna Thodu) ద్వారా 79.174 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి జరిగింది. సామాజిక సాధికారతను ఇది నిదర్శనం. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచింది. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. ప్రతీ అడుగులోనూ పారదర్శకంగా పాలన. చేయి పట్టుకుని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు. ఇంకా మంచి చేసే అవకాశం కలగాలి’ అని ఆకాంక్షించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement