YSR Rythu Bharosa: కౌలు రైతులకు జగన్ సర్కారు శుభవార్త, రేపే అన్నదాతల అకౌంట్లోకి రూ. 7500, వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.109.74 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం (rs 109.74 Crore ) పంపిణీ చేయనున్నారు.

CM Jagan (Photo/Twitter-AP CMO)

Vjy, August 31: ఏపీలో కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్లెంబర్ 1వ తేదీన రైతులకు రైతు భరోసా (YSR Rythu Bharosa) అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమకానుంది. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది.

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం (rs 109.74 Crore ) పంపిణీ చేయనున్నారు. కాగా దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేస్తోంది. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని సెప్టెంబర్‌ 1న అందించనుంది.

జగన్‌కు రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు, ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో భూ యజమానులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది.

రాజానగరంలో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన రాయపురెడ్డి ప్రసాద్‌, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

ఐదో ఏడాది తొలి విడతగా తాజాగా అందచేస్తున్న సాయంతో కూడా కలిపితే ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వో­ఎఫ్‌ఆర్‌ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కానుంది. ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించినట్లవుతోంది.

ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా దాదాపు 7.77 లక్షలమందికి ఈ ఏడాది కౌలు కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందరి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.కౌలు రైతులకు ఈ ఏడాది రూ.4వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif