Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక

ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.

YSRC Jagan questions CM Chandrababu on medical seats Issue

Vij, Sep 15:  రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.

నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? అన్నారు.

.దీన్ని గుర్తించే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్‌ చదువులు చదవడం లేదా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి? అన్నారు.

కోవిడ్‌లాంటి సంక్షోభం ఉన్నా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చుచేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధంచేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చుచేసుకుంటూవెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్ర‌యివేటు మీద మీకు అంతమోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? అని ప్రశ్నించారు.   జగన్ మరో కీలక ప్రకటన, మాజీ మంత్రి రోజా- యాంకర్ శ్యామలకు కీలక పదవులు, పెద్దిరెడ్డికి సైతం పెద్దపీట వేసిన వైసీపీ అధినేత..కీలక పదవులు దక్కించుకున్న నేతలు వీరే

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టంరాకూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్లకోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడింది చంద్రబాబు అన్నారు.

పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. సూపర్‌స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లాస్థాయిలోనే అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, ప్రైవేటు ఆస్పత్రులకు పోటీ లోపించి వైద్యంకోసం వసూలుచేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తుందన్న మాట వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్‌లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్యరంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు అన్నారు.  వరల్డ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం, ఆలయ ప్రాముఖ్యత నేపథ్యంలో చోటు, వెల్లడించిన ఆలయ అధికారులు 

ఇకనైనా కళ్లుతెరవండి చంద్రబాబుగారూ. వెంటనే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తిచేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి. మీకు చేతనైనంత మీరు ఖర్చుచేస్తూ వెళ్లండి. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్‌కాలేజీల ప్రయివేటుపరం మాటున స్కామ్‌లు చేయడం మానుకో చంద్రబాబూ! లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని గుర్తించుకోండని హెచ్చరించారు జగన్.