IPL Auction 2025 Live

Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

YSRCP Leader, Bapatla Ex MP Nandigam Suresh Arrest

Hyd, Sep 5:  వైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

ఇవాళ ఉదయమే సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీలోని ఆయన ఇంటికి వెళ్లగా సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సెల్‌ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించాయి.

ఇక ఈ కేసులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేసుకునేంతవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేయగా అరెస్ట్ నుంచి వారికి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం వైసీపీ నేతల పిటిషన్‌ను కొట్టివేసింది.  వీడియో ఇదిగో, విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, గండి పడకుండా పరివాహక గట్లకు మట్టి కట్టలు వేస్తున్న ప్రజలు 

Here's Tweet:

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాటు వైసీపీ నేతల ప్రమేయంపై ఆధారాలు లభించడంతో వారిపై కేసులు నమోదుచేశారు పోలీసులు.