Perni Nani Fires on TDP:అదంతా బోగస్ సర్వే! రాబిన్ శర్మ టీడీపీ జీతగాడు, జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్‌ను ఎవరూ పడేయలేరు, పొలిటికల్ సర్వేపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్, టీడీపీని పైకి లేపే కుట్ర అంటూ మండిపాటు

సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ(Center for National Studies) పేరిట రిలీజ్ అయిన ఈ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. సర్వే రిలీజ్ చేసిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థపై మండిపడ్డారు

Andhra Pradesh Transport Minister Perni Nani(photo-Twitter)

Machilipatnam, July 13: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohanReddy) గ్రాఫ్ పడిపోయిందంటూ ఏపీలో విడుదల చేసిన ఓ సర్వే(Survey) సంచలనం సృష్టిస్తోంది. సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ(Center for National Studies) పేరిట రిలీజ్ అయిన ఈ సర్వేకు సంబంధించిన రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వైసీపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. సర్వే రిలీజ్ చేసిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని(Perni nani). ఈ సంస్థ రాబిన్ శర్మ అనే వ్యక్తిది అని, అతను టీడీపీ జీతగాడు అంటూ ఫైరయ్యారు. పేర్నినాని మాట్లాడుతూ "వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉంది. ఇలా చెప్పిన సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌ శర్మదే(Rabin Sharma). టీడీపీని(TDP) కాపాడుకోవడానికి చేయించిన సర్వే ఇది. అందుకే వాళ్లు ఇలా రిపోర్టు ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ద్వారా టీడీపీ గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారు. కానీ, అలా జరగలేదు. తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్‌ లేవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది. దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరు. వైఎస్‌ జగన్‌ (YS Jagan)అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇలాంటి సర్వేలు(Survey) సీఎం వైఎస్‌ జగన్‌కు ఏమీ చేయలేవు’’ అని అన్నారు.

CM Jagan Review: ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని చికిత్సలు, ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అందుబాటులోకి..

ఈ సర్వేను టీడీపీ రిలీజ్ చేయించిందని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. పవన్‌ కల్యాణ్‌ ద్వారా త‌న‌ గ్రాఫ్‌ పెంచుకోవాలని టీడీపీ చూసింద‌ని, అయితే అది సాధ్యం కాలేదని నాని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేశ్ వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ లేవడం లేదన్నారు.

APSRTC: సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, RTCలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్, 896 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం  

మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్‌ సర్వేను బయటకు వదిలారని నాని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్వేలు జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఏమీ చేయ‌లేవ‌న్న నాని.. జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌ నాయకత్వంపైనా ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయ‌ని నాని పేర్కొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif