Perni Nani Slams Pawan Kalyan: నా ఈకలు కూడా పీకలేవు పవన్, నీకంటే పెద్ద మొగోడిని నేను, రెండు చెప్పులు చూపిస్తూ మక్కెలిరిగిపోతాయంటూ పేర్ని నాని మాస్ వార్నింగ్
రోజుకొక డైలాగ్ చెప్పి పవన్ వ్యూహం అంటారు.
Vjy, June 15: జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు.గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, పవన్ పూటకొక మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజుకొక డైలాగ్ చెప్పి పవన్ వ్యూహం అంటారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు.నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.
మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపిస్తూ మండిపడ్డారు. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే నీకంటే పెద్ద మొగోడిని కాబట్టి నేను రెండు చెప్పులు చూపిస్తున్నానని, మక్కెలిరిగిపోతాయని పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు. గతంలో జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా పేర్ని నాని తాజాగా రెండు చెప్పులు చూపిస్తూ హెచ్చరించారు.
ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి వెళతారని, వ్యూహాలను, చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని పేర్ని నాని హితవు పలికారు.చంద్రబాబు చొక్కా పట్టుకొని పవన్ ఏనాడైనా నిలదీశారా?. పవన్ ఆఫీసులో కూర్చొని సినిమా డైలాగ్‌లు, సొల్లు కబుర్లు చెబుతాడు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తాను.. పవన్‌ను అడ్డం పెట్టి జనసేన పార్టీని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు సొంత డబ్బు ఖర్చుపెట్టారా?. పవన్ ప్రతి సినిమా రిలీజ్ ముందు కేసీఆర్ కాళ్లు మొక్కుతాడు. గులాబీ జెండాను వెనక జేబులో పెట్టుకొని తిరుగుతున్నదెవరు?’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.
హరీష్‌రావు ఆంధ్రరాష్ట్రాన్ని తిడుతుంటే పవన్ ఏం చేస్తున్నారు?. జగన్ సీఎం అయినప్పటి నుంచి పవన్ ఒక్క సినిమా అయినా ఆగిందా?. పవన్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లపై జీఎస్టీ వేసారా? లేదా?. సీఎం పదవి అనేది ఎవరో దానం చేస్తే వచ్చేది కాదు.. పవన్ డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
ఓవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే సమయంలో టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పారంటూ పవన్ కల్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాట పాడుతూ, ఏపీలోకి రాగానే పవన్ కల్యాణ్ తెలంగాణ నేతలపై విమర్శల పాటపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి ఎన్ని వ్యూహాలైనా పన్నుతానంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ పేర్ని నాని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్న పవన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గోదానం, భూదానం తరహాలో ముఖ్యమంత్రి పదవి కూడా దానం చేస్తారా అని ప్రశ్నించారు. ‘ఏదీ తనకు తానుగా నీ దరికి రాదు.. శోధించి సాధించాలి‘ అన్న శ్రీశ్రీ కొటేషన్ ను ప్రస్తావిస్తూ జగన్ శోధించి సీఎం పదవిని సాధిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం అడుక్కుంటున్నాడని పేర్ని నాని విమర్శించారు.