pawan kalyan (Photo-Twitter/Janasena)

కత్తిపూడి వేదికగా పొలిటికల్ కత్తులు దూశారు జనసేనాని పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో కక్ష గట్టి ఓడించారని.. కానీ..ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తామన్నారు పవన్. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతామన్నారు. ఇక పొత్తులపైనా పవన్ స్పందించారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. సీఎం పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తామన్నారు.

కత్తిపూడి సభలో పవన్ కామెంట్స్ ఇవే..

>>  నవంబర్‌లోనో డిసెంబర్‌లోనో ఎన్నికలు వస్తాయి. ముందస్తు ఎన్నికలు రావని సీఎం కథలు చెప్తున్నాడు. సీఎం ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడుతున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు

>  కాకినాడ MLA ఒకసారి తిట్టాడు, గుర్తుంది, ఎలా మర్చిపోతాను, మా ఆడపడుచులు, నాయకులపై కులం పేరుతో దోషించావు, దాడి చేయించావు, మర్చిపోలేదు, కాకినాడలో తేల్చుకుందాం

>> ఒక అధికారి అవినీతి చేస్తే ACB ఉంది, మరి ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు లేరా? మనమే ప్రశ్నించాలి. అందుకే ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం!

>> సొంత చిన్నాన్న రక్తం జగన్ చేతికి అంటుకుని ఉంది, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ఉండాలా? 10 వేలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి 20వేలు రిపేర్ల కోసం ఖర్చు పెట్టించే నాయకుడు కావాలా? 18 దళిత పథకాలు తీసేసిన వ్యక్తి కావాలా నేను కావాలా ఆలోచించండి