TDP Office Attack Case: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Lella Appi Reddy arrested (Photo-Video Grab)

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా, నందిగం సురేశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి