YCP MLC Challa Dies: కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన చల్లా రామకృష్ణారెడ్డి, గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిక
హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి (YSRCP MLC Challa Dies) చెందారు. కాగా చల్లాకు గత నెల 13న కరోనా సోకింది. ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస (challa ramakrishna reddy Died with Covid) విడిచారు.
Amaravati, Jan 1: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనావైరస్ తో కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి (YSRCP MLC Challa Dies) చెందారు. కాగా చల్లాకు గత నెల 13న కరోనా సోకింది. ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస (challa ramakrishna reddy Died with Covid) విడిచారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి మృతిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డి (challa ramakrishna reddy) బలమైన నేతగా ఉన్నారు. ఆయన రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు.
1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి.
కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు.
అసోం మాజీ సీఎం తరుణ్ గొగాయ్ కన్నుమూత, కరోనాతో ఒడిషా గవర్నర్ భార్య, గాంధీ మనవడు సతీష్ ధుపేలియా మృతి
ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ సభ్యత్వం, సివిల్ సప్లై కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేసి వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత, జిల్లాలో కీలక నేత కావడం, పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి కేడర్ ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయన్ను ఎమ్మెల్సీని చేసింది.
ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. చల్లా అంత్యక్రియలు అవుకులో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు జిల్లా నేతలతో పాటు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.