Andhra Pradesh Election Results 2024: పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వైసీపీ, ఇప్పటికే సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు.

YV Subbareddy (photo-Video Grab)

Vjy, May 29: మే 13న జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్‌ చెబుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్‌ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ అన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ఇక నిన్న అడిషనల్‌ సీఈవోను వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్‌ అధికారం సంతకం పెట్టి స్టాంప్‌ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్‌ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్‌ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.

‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి: సజ్జల

ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్‌ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్‌ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.