YSRCP Support For Dhankar: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు పలికిన వైఎస్సార్సీపీ, ట్విట్టర్ ద్వారా ధన్‌కర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ విజయసాయి రెడ్డి..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కర్ కే మద్దుతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు తెలిపి వైఎస్సార్సీపీ, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది.
వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కర్ కే మద్దుతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు తెలిపి వైఎస్సార్సీపీ, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. జగదీప్ ధన్‌కర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆయనకు మద్దతు తెలిపింది వైఎస్సార్సీపీ.
జగదీప్ ధనకర్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రైతు బిడ్డ జగదీప్ ధనకర్‌ని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో రాజ్యసభతో దేశ గౌరవం కూడా పెరుగుతుందన్న నమ్మకం ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అధికారిక ప్రకటనగానే భావించవచ్చు. విజయసాయిరెడ్డి కూడా తన ట్వీట్‌లో జగదీప్‌ను రైతు బిడ్డ అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఉపరాష్ట్రపతి హోదాలో చూడడం మంచి విషయమని.. అందుకనే ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.