Brutal Murder For Rs. 500: ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??
రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు.
Hyderabad, Dec 30: హైదరాబాద్ (Hyderabad) లో దారుణం జరిగింది. రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని (Brutal Murder For Rs. 500) బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. అతడి దగ్గర శ్రీనివాస్ సహా పలువురు డైలీ లేబర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. సాయి దగ్గర శ్రీనివాస్ గతంలో రూ. 500 అప్పుగా తీసుకున్నాడు. కాగా, ఆదివారం రాత్రి ఇద్దరు మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో తాను ఇచ్చిన రూ. 500ను తిరిగి ఇవ్వాలంటూ సాయి.. శ్రీనివాస్ ను ఒత్తిడి చేశాడు. దీనికి శ్రీనివాస్ నిరాకరించాడు.
నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి
Here's Video:
ఆవేశం పెరిగి..
అలా.. ఇద్దరి మధ్య 500 రూపాయల విషయంలో గొడవ పెరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. వివాదం మరింతగా ముదిరింది. దీంతో ఆవేశానికి లోనైనా సాయి పక్కనే ఉన్న డ్రైనేజ్ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై కొట్టాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్ గా రికార్డు