Hyderabad, Dec 30: తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) (Telangana Assembly Session) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు నివాళులర్పించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై నిర్ణయించిన విషయం తెలిసిందే. సభ ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా, సభ్యులంతా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవడంతోపాటు నివాళులర్పించనున్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనున్నది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్ గా రికార్డు
Telangana : నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | Telangana Assembly to Hold Special Sessionhttps://t.co/O25zSBnnVd#assembly #telangana #telanganaassembly #manmohansingh #hmtvlive #hmtvnews
— hmtv News (@hmtvnewslive) December 30, 2024
ఆర్ధిక మార్గదర్శి
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన మేథస్సుతో గట్టెక్కించడమే కాకుండా పదేండ్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో చిరస్మరణీయ పథకాలను అమలు చేశారు. ఈ నెల 26న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశాన్ని నవ్యపథంలో నిలిపిన సింగ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధులు నివాళి అర్పించనున్నారు.