IPL Auction 2025 Live

Special Trains To Sabarimala: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. శబరిమలకు ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 27వరకు అందుబాటులోకి

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.

Sabarimala Temple (Photo Credits: IANS)

Sabarimala, Nov 26: తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా శబరిమలకు (Sabarimala) (కొల్లం, కొట్టాయం స్టేషన్లకు) పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అయ్యప్ప మాల ధరించి కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎయిర్ పోర్టు పీఎస్ లో అయ్యప్ప స్వాముల ఫిర్యాదు

ఏపీ నుంచి సర్వీసులు ఇలా..

విశాఖ - కొల్లం ప్రత్యేక రైలు (08539/08540) ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం చేరుకోనుంది. కొల్లం - విశాఖ రైలు డిసెంబర్ 5 నుంచి ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7.35 గంటలకు బయలుదేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.  అలానే శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య డిసెంబర్ 1 నుంచి ప్రతి సోమవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ..బుధవారం వేకువజాము 2.30 గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

తెలంగాణ నుంచి సర్వీసులు ఇలా..

హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలు డిసెంబర్ 3 నుండి జనవరి 1వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. అలాగే కొట్టాయం - హైదరాబాద్ ప్రత్యేక రైలు బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి గురువారం రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. కాచిగూడ - కొట్టాయం మధ్య డిసెంబర్ 5 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడలో బయలుదేరి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. తిరుగు ప్రయాణానికి కొట్టాయం - కాచిగూడకు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) ప్రత్యేక రైలు రాత్రి 8.30 గంటలకు కొట్టాయంలో బయలుదేరి శనివారం రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోనుంది.

మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. గుడిలో అమ్మవారినీ ఎత్తుకెళ్ళిన దుండగులు (వీడియో)